Ravi Teja, Sandeep Raj: రవితేజ నెక్స్ట్ సినిమా… సందీప్‌ రాజ్‌కి పెద్ద చిక్కొచ్చి పడిందే!

తొలి సినిమాతో హిట్ కొట్టి… రెండో సినిమా కోసం నెలలు, ఏళ్లు తరబడి వెయిట్‌ చేయడం ఇటీవల టాలీవుడ్‌ దర్శకుల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడో ‘ఉప్పెన’ సినిమా చేసి ఇంకా రెండో సినిమా స్టార్ట్‌ చేయకుండా బుచ్చిబాబు సానా వెయిట్‌ చేస్తున్నారు. ఈ తరహాలో సందీప్‌ రాజ్‌ కూడా వెయిటింగ్‌ లిస్ట్‌లోనే కనిపిస్తున్నారు. ‘క‌ల‌ర్ ఫొటో’ అనే చిన్న సినిమాతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు సందీప్ రాజ్‌. కానీ ఆ తర్వాతి సినిమా ఇంకా స్టార్ట్‌ కాలేదు.

‘కలర్‌ ఫొటో’ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీ వసూళ్లు సాధించకపోయినా… విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొంది. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకుంది. దీంతో సందీప్‌ రాజ్‌ పేరు టాలీవుడ్‌లో మారు మోగిపోయింది. ఈ క్రమంలో పెద్ద హీరోతో తర్వాతి సినిమా అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అనుకున్నట్లుగా ఆ హీరో రవితేజ అని, ఆ సినిమా పేరు ‘లాక్‌’ అంటూ వార్తలు వచ్చేశాయి. కానీ ఇంతవరకు సినిమా మొదలుకాలేదు.

దర్శకుడు కథతో వస్తే… ఠక్కున సినిమా మొదలుపెట్టేసే రకం (Ravi Teja) రవితేజ. చాలా త్వరగా ఆయన దగ్గర కథలు ఓకే అయిపోయి, సెట్స్‌ మీదకు వెళ్లిపోతుంటాయి. కానీ సందీప్‌ రాజ్‌ సినిమా మాత్రం ఇంకా హోల్డ్‌లోనే ఉంది. ఎందుకు అని ఆరా తీస్తే… ఇంకా ఇద్దరు నటులు ఫైనల్‌ కాకపోవడమే కారణం అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్‌ క్యారెక్టర్‌తో అదరగొట్టేస్తాడట. అయితే మరో ఇద్దరు హీరోలకు ఈ సినిమాలో క్యారెక్టర్స్‌ ఉన్నాయి.

దాని కోసం మంచు మనోజ్‌, శర్వానంద్‌ లాంటి వాళ్లను ఇప్పటికే సంప్రదించారు అని ఓ టాక్‌ నడుస్తోంది. దాంతోపాటు మరికొంతమంది నటులను కూడా సంప్రదించారట. అయితే అక్కడి నుండి ఇంకా ఎలాంటి అంగీకారాలు రాకపోవడంతో ఈ సినిమాను కాస్త పక్కనపెట్టి రవితేజ వేరే సినిమాలు ఓకే చేసి సెట్స్‌పైకి ఎక్కించేశాడు అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పటికి ముందుకు వెళ్తుందో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus