‘వకీల్ సాబ్’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ రోల్ చేస్తున్నారు. అది మరీ సీరియస్ కాన్సెప్ట్ సబ్జెక్ట్. పవన్ రోల్ లెంగ్త్ కూడా తక్కువ వుంటుంది. లాయర్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తే ఎలాగుంటుందని డైరెక్టరుమారుతికి ఐడియా వచ్చింది. స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అది రవితేజ దగ్గరకి వెళ్లింది. మారుతి స్టయిల్ ఫన్, స్టోరీ నచ్చడంతో మాస్ మహారాజ్ ఓకే చేశాడట.
పవన్ సినిమాకి ‘వకీల్ సాబ్’ టైటిల్ పెట్టారు. రవితేజ సినిమాకి లాయర్ సాబ్ టైటిల్ పెట్టినా పెట్టవచ్చని టాక్. ఆ టైటిల్ కన్సిడర్ చేస్తున్నారట. మారుతి ట్రేడ్ మార్క్ వినోదంతో పాటు కాస్త సీరియస్ ఇష్యూలను టచ్ చేస్తూ సినిమా వుంటుందట. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. చాలా రోజుల నుండి రవితేజ, మారుతి సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికి కుదురుతోంది.
ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ ‘క్రాక్’ చేస్తున్నారు. అది పూర్తయ్యాక రమేష్ వర్మ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత డైరెక్టర్లు త్రినాథరావు నక్కిన, వక్కంతం వంశీతో సినిమాలు చేయాలనీ అనుకున్నప్పటికీ మారుతి స్టోరీ నచ్చడంతో వాళ్ళు ఇద్దరినీ పక్కన పెట్టాడట.