Ravanasura: ఆ సీజన్ లో అందరికంటే ముందుగానే రానున్న రవితేజ..!

‘మాస్ మహారాజా’ రవితేజ వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ జెటో స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజ్ కాగా.. ‘ధమాకా’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలు చేతిలో ఉన్నాయి. దీపావళి పండక్కి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు మాస్ మహారాజా.. ‘రావణాసుర’ మూవీ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు టీం.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చేసింది.. దివాళీ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. స్టైలిష్ లుక్ లో స్మోక్ చేస్తూ.. తీక్షణంగా చూస్తున్న పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

సమ్మర్ స్పెషల్ గా 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో ‘రావణాసుర’ గా రవితేజ మాస్ జాతర చూడబోతున్నామని తెలిపారు.. అందరికీ విషెస్ చెబుతూ మాస్ మహారాజా అప్ డేట్ షేర్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐదుగురు హీరోయిన్లతో నటిస్తున్నాడాయన. అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాశ్, దీక్ష నగార్కర్ ఫీమేల్ లీడ్స్ గా కనిపించనున్నారు. ఇంతమంది కథానాయికలతో రవితేజ తెరపై ఎలా కనిపించబోతున్నాడో అనే ఆసక్తి కలుగుతుంది.

అభషేక్ ఆర్ట్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. యంగ్ హీరో సుశాంత్ కీీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చే ఏడాది సమ్మర్ లో అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమాలైతే లేవు కాబట్టి వేసవి సీజన్ అనేది రవితేజ ‘రావణాసుర’ మూవీతోనే మొదలువుతుందనుకోవచ్చు.. మాస్ మహారాజా పవర్ ఫుల్ లాయర్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, జయ ప్రకాష్ తదితరులు ఇతర తారాగాణం.. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. గత సినిమాలు కాస్త నిరాశ పరచడంతో ‘రావణాసుర’ హిట్ అయ్యి తమ అభిమాన హీరో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus