Ravi Teja, Chiranjeevi: మాస్ మహారాజ్ డిమాండ్ మామూలుగా లేదుగా!

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి వరుసగా సినిమాలలో నటించడంతో పాటు తన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కే విధంగా చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి బాబీ కాంబో మూవీలో రవితేజ స్పెషల్ రోల్ లో నటించనున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

చిరంజీవి తమ్ముడి పాత్రలో రవితేజ కొంత సమయం కనిపించనుండగా ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ బల్క్ డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. జనవరి నెలలో రవితేజ నటించే సీన్స్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన అన్నయ్య సినిమాలో రవితేజ చిరంజీవికి తమ్ముడిగా నటించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో రవితేజ స్పెషల్ సాంగ్ లో కొన్ని సెకన్ల పాటు కనిపించారు.

చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ సినిమాసినిమాకు పారితోషికాన్ని పెంచుతున్నారు. మరోవైపు రవితేజ నటించిన ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus