Ravi Teja, Chiranjeevi: అప్పుడు రూ.1.5 లక్షలు.. ఇప్పుడు ఒక్క రోజుకే రూ.25 లక్షలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు రవితేజ కూడా ఓ 40 నిమిషాల నిడివి గల కీలక పాత్రలో ఊర మాస్ గా కనిపించబోతున్నాడు. ఎప్పుడైతే రవితేజ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు అనే వార్త బయటకి వచ్చిందో అప్పటి నుండీ ఈ చిత్రం పై జనాల ఫోకస్ మరింతగా పెరిగింది.

గతంలో కూడా రవితేజ.. చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరు తమ్ముడిగా నటించాడు రవితేజ. అటు తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్‌’ లో కూడా చిన్న అతిధి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు రవితేజ కూడా స్టార్ అయ్యాడు కాబట్టి.. చిరు సినిమాలో కనిపించడం అనేది ఆసక్తిని పెంచే విషయం. అయితే ఈ 40 నిమిషాల నిడివి గల పాత్రకి రవితేజ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

రవితేజ షూటింగ్లో పాల్గొనే ఒక్కో రోజుకి రూ.25లక్షల చొప్పున చెల్లించేందుకు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు రెడీ అయ్యారట. మొత్తంగా ఈ చిత్రం కోసం రవితేజ 7 రోజుల నుండీ 10 రోజుల వరకు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ లెక్కన చూసుకుంటే రూ.1.75 కోట్ల నుండీ రూ.2.5 కోట్ల వరకు అందుకుంటాడన్న మాట. నిజానికి ‘అన్నయ్య’ చిత్రానికి రవితేజ మొత్తంగా అందుకున్న పారితోషికం కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే..!

ఇప్పుడు అదే చిరు సినిమా కోసం అతను రోజుకి రూ.25 లక్షలు తీసుకునే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడు అతని కాల్ షీట్లు పట్టడం కూడా కష్టమే. బాబీ అంటే ఆల్రెడీ రవితేజకి ‘పవర్’ అనే సినిమా చేసి పెట్టాడు. ఇక ‘మైత్రి’ నిర్మాతలకి రవితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది.అందుకే ఈ ప్రాజెక్టుకి అతను ఓకె చెప్పినట్టు తెలుస్తుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus