Ravi Teja: హరీష్ శంకర్ పై రవితేజ సెటైర్లు!

దర్శకుడు హరీష్ శంకర్ కు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిందే రవితేజ. అందుకే రవితేజకి మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ ను కట్టబెట్టాడు హరీష్ శంకర్. వీరి కాంబినేషన్లో మొదట ‘షాక్’ సినిమా వచ్చింది. 2006 లో వచ్చిన ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత హరీష్ శంకర్ అడ్రెస్ గల్లంతయ్యింది. ఆ టైంలో కూడా తనే రెండో ఛాన్స్ కూడా ఇచ్చాడు రవితేజ. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘మిరపకాయ్’ సూపర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత హరీష్ శంకర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిరాలేదు. రవితేజని హరీష్ అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ తో చిన్న చిట్ చాట్ ఏర్పాటు చేసారు మేకర్స్. ఇందులో రవితేజతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సుశాంత్ కూడా పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూ చాలా చాలా ఫన్నీగా జరిగింది. అయితే హరీష్ శంకర్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నా, ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఏదో ఒక విధంగా తన సినిమాల ప్రస్తావన తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా వరకు అదే సీన్ రిపీట్ అయ్యింది. ‘మీరు ఇండస్ట్రీకి ఎంతో మంది లెజెండ్స్ ను పరిచయం చేసారు’ అంటూ రవితేజతో అన్నాడు హరీష్. తర్వాత ‘అందులో నేను కూడా ఉన్నందుకు నా అదృష్టం’ అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.

దీనికి రవితేజ (Ravi Teja) ఓ లుక్ ఇచ్చాడు. అది ఫన్నీగా అనిపిస్తుంది. తర్వాత రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా.. ‘మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి’ అంటూ రవితేజని హరీష్ అడిగాడు. అందుకు రవితేజ ‘విక్రమ్ సింగ్ రాథోడ్ ‘(విక్రమార్కుడు సినిమాలో పాత్ర) అని చెప్పాడు. అటు తర్వాత హరీష్ ‘మీ సినిమాల్లో అన్ని పాత్రలు బాగుంటాయి. ‘మిరపకాయ్’ లో కూడా మీ పాత్ర బాగుంటుంది’ అంటూ అన్నాడు. అప్పుడు రవితేజ ‘ఏదో ఒక రకంగా నీ సినిమాలను తీసుకురాకుండా కంప్లీట్ చేయడు’ అంటూ కామెంట్ చేశాడు

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus