టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. ఒకానోక సమయంలో అయితే ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డులకు ప్రాణం పోస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కాలం కలసిరాక పాపం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. కాకపోతే పవన్ ఇమేజ్ కి తగ్గటు ఉన్న చిత్రానికి కొంత ఆదరణ లభించి కలెక్షన్ల పరంగా కాస్త 50 కోట్లు దాటింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో తన కరియర్ మలుపు తిరిగి ఎక్కడికో వెళ్లిపోతాను అని కలలు కన్న దర్శకుడు బాబీకి ఆదిలోనే చుక్కెదురయ్యింది.
ఎంత సర్దార్ సినిమా ఫ్లాప్ కావడానికి నైతిక భాద్యత పవన్ తనపైనే వేసుకున్న ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా దర్శకుడు బాబీ తలెత్తుకోలేక మీడియాకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఎవ్వరికీ కనిపించకుండా ఉంటున్న దర్శకుడు బాబీకి అండగా ఉంటాను అని రవి తేజ అభయం ఇచ్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పవర్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే..దీంతో మరోసారి బాబీని ఆదుకోవడానికి ముందుకొచ్చినట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇక రవి తేజ తనతో సినిమా చేస్తాను అని చెప్పడంతో ఆనందం పట్టలేని బాబీ వెంటనే మంచి కథకోసం ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా అండగా ఉంటూ దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటే మంచి సినిమాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ అవుతాయి అని విల్శ్లేషకులు చెబుతున్నారు. మరి యువ హీరోలు అందరూ రవిలాగా అండగా నిలవాలని ఆశిద్దాం.