Ravi Teja: 10 రూపాయల నుంచి 30 కోట్ల వరకు.. ఇది కదా సక్సెస్ అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈయన నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 30 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి రవితేజ ఒకానొక సమయంలో చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునే వారని తెలుస్తోంది.

రవితేజ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఈయన అనంతరం చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలుపెట్టారు. ఇలా పలు సినిమాలలో హీరో స్నేహితుడు పాత్రలలోనూ తమ్ముడు పాత్రలలోను రవితేజ కనిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే.

ఈ సినిమాలో రాజశేఖర్ స్నేహితుడి పాత్రలో రవితేజ కనిపించారు. ఇక ఈ సినిమాలో ఈయనకు పెద్దగా డైలాగ్స్ కూడా లేవు అని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో నటించినందుకు ఈయనకు రోజుకి ₹10 రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చేవారట. భోజనం పెట్టి పది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి (Ravi Teja) రవితేజ.

నేడు ఒక్కో సినిమా కుసుమారు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇది నిజంగా గొప్ప సక్సెస్ అనే చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus