Ravi Teja: నిర్మాత మాటను లెక్క చేయకుండా ఆ పని చేస్తున్న రవితేజ..!

మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతున్నాడు. ‘ధమాకా’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన రవితేజ, ఆ తర్వాత ‘రావణాసుర’ మరియు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలతో వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయనకీ అర్జెంటు గా ఒక్క పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి.

అందుకే ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్న కార్తీక్ ఘట్టమనేని తో ‘ఈగల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ కి కూడా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ గెటప్ కూడా బాగుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ అప్డేట్ బయట లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాల కోసం రవితేజ మాజీ ఆర్మీ ఆఫీసర్ దగ్గర గన్ ఫైరింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఈ గన్ ఫైరింగ్ కోసం నిజమైన గన్, నిజమైన బుల్లెట్స్ ని వాడుతున్నారట.

నిర్మాత ఎందుకు అంత అవసరం?, డమ్మీ బుల్లెట్స్ ని వాడొచ్చు కదా, ఎవరికైనా తగిలితే పెద్ద రిస్క్ అని చెప్పినా కూడా, రిస్క్ నేను తీసుకుంటాను, సీన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే కచ్చితంగా నిజమైన గన్ తోనే ప్రాక్టీస్ చెయ్యాలి అని రవితేజ చెప్పాడట. దీంతో మేకర్స్ కూడా చేసేది ఏమి లేక రవితేజ కి (Ravi Teja) ఓకే చెప్పారట. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ నటిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus