టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమాకు హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మిరపకాయ్ (Mirapakay) తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
ఈ నెల 14వ తేదీ సాయంత్రం నుంచి మిస్టర్ బచ్చన్ సినిమా షోలు ప్రదర్శితం అవుతున్నాయి. ఈ సినిమాకు అన్ని ఏరియాలలో బుకింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బుకింగ్స్ పరంగా టాప్ లో ఉంది. అయితే ఈ సినిమాకు పోటీగా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) , తంగలాన్ (Thangalaan) , ఆయ్ (AAY) సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సినిమాలపై కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి.
పోటీ ఎక్కువగా ఉండటంతో మిస్టర్ బచ్చన్ సినిమా ఇతర సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ టాక్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భాగ్యశ్రీ బోర్సేకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. రవితేజ వయస్సు పెరుగుతున్నా తన లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. భాగ్యశ్రీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.