Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ పోస్ట్ పోన్ కు కారణాలు అవేనట..!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘ఎస్.ఎల్.వి సినిమాస్ ఎల్.ఎల్.పి’ మరియు ‘ఆర్.టి.టీమ్‌ వర్క్స్‌’ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నిజానికి జూన్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్మాతలు అనౌన్స్ చేసిన డేట్ కు ఈ మూవీ విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని నిర్మాతలే కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని…., మంచి క్వాలిటీతోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోవాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారు. ఇక ఈ చిత్రం కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం రివీల్ చేసింది.దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

‘ఖైదీ'(2019) వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతం అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీలో రవితేజ నిజాయితీ కలిగిన ఓ సివిల్ సెర్వెన్ట్ గా కనిపించబోతున్నాడు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’ చిత్రం ప్లాప్ అయ్యింది.

దాంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం చేస్తున్నాడు రవితేజ. మాస్ ఆడియెన్స్ ను అలరించే అన్ని అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus