Ravindar: అలాంటి సమస్యతో బాధపడుతున్న రవీందర్ చంద్రశేఖరన్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రవీందర్ చంద్రశేఖరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిర్మాతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా బిగ్ బాస్ రివ్యూయర్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన మహాలక్ష్మి అనే నటిని పెళ్లి చేసుకున్నారు. 2022వ సంవత్సరంలో వీరిద్దరూ రెండవ వివాహం చేసుకోవడంతో వీరి వివాహం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది

ఈమె ఆస్తి కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుంది అంటూ తనపై విమర్శలు వచ్చాయి అదే విధంగా ఇటీవల ఈయన జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తన తప్పు లేకుండానే నాపై నిందలు వేసి తనని జైలుకు పంపించారు అంటూ ఈ ఘటనపై రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారమవుతున్నటువంటి తరుణంలో బిగ్ బాస్ షో సమీక్షకు వచ్చిన ఆయన..

అనారోగ్యంతో కనిపించారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. ఇలా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆక్సిజన్ మాస్క్ వేసుకొని మరీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన రివ్యూలు ఇస్తూ వచ్చారు. ఈ విధంగా ఈయనకు ఆక్సిజన్ మాస్క్ పెట్టడంతో అందరూ ఏమైంది అంటూ కంగారు వ్యక్తం చేశారు.

అయితే ఈయనకు (Ravindar) శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అదేవిధంగా లంగ్స్ పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురి కావడంతోనే ఇలా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారని తెలుస్తోంది. వారం రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స తీసుకున్నానని వెల్లడించారు. ఇక ఈ విషయం తెలియడంతో ఆరోగ్యం కుదుట పడే వరకు బిగ్ బాస్ రివ్యూలు ఇవ్వకండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus