Raviteja, Adivi Sesh: అడివి శేష్ అలా చేయకపోతే నష్టపోక తప్పదా?

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ ఒకరనే సంగతి తెలిసిందే. అడివి శేష్ ఈ ఏడాది మేజర్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. నిర్మాతలకు ఈ సినిమాతో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. అడివి శేష్ నటించిన హిట్2 వచ్చే నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అడివి శేష్ కు రవితేజ భారీ షాకిచ్చారు.

రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ కూడా అదే తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రెండు సినిమాల జానర్ లు వేరు అయినా రామారావు ఆన్ డ్యూటీ, హిట్2 ఒకేరోజు విడుదలైతే హిట్2 సినిమా నష్టపోక తప్పదు. మేజర్ సినిమా రిలీజైన రోజునే విక్రమ్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇతర భాషల్లో మేజర్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే. జులై 29వ తేదీన రిలీజ్ డేట్ ను ప్రకటించి రవితేజ ఒక విధంగా అడివి శేష్ కు షాకిచ్చారనే చెప్పాలి.

హిట్2 రిలీజ్ డేట్ మార్చితే మాత్రమే అడివి శేష్ సినిమాకు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. హిట్2 క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన నేపథ్యంలో అడివి శేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అడివి శేష్ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలను సొంతం చేసుకున్నాయి. అడివి శేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యూత్ లో అడివి శేష్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అడివి శేష్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. మేజర్ సినిమాతో అడివి శేష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రాగా అడివి శేష్ తర్వాత ప్రాజెక్ట్ లు ఇతర భాషల్లో విడుదలవుతాయో లేదో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus