మాస్ రాజా ప్లాన్ వర్కవుట్ అయినట్లే!

స్టార్ హీరోలు రెమ్యునరేషన్ కి బదులుగా ఏరియాల రైట్స్ ని తీసుకుంటూ ఉంటారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు. కానీ మొదటిసారి రెమ్యునరేషన్ తీసుకోకుండా ‘క్రాక్’ సినిమా చేశాడు. రెమ్యునరేషన్ సెటిల్ అవ్వకముందే సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కూడా తన సత్తా చాటుతోంది.

ఈ సినిమాకి ముందుగా రెమ్యునరేషన్ తీసుకొని రవితేజ దానికి బదులుగా నైజాం, వైజాగ్ హక్కులను తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా వలన రవితేజకు బాగానే గిట్టుబాటైనట్లు ఉంది. నైజాం నుండి ఆరు కోట్లకు పైగా మొత్తాన్ని రవితేజ అందుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో టోటల్ రన్ లో మూడున్నర కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ ఉత్తరాంధ్రలో సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే రవితేజకి మొత్తంగా పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ విధంగా చేయడం వలన అటు నిర్మాతలకు వడ్డీలు మిగలడంతో పాటు… ఇటు హీరోకి కావాల్సినంత రెమ్యునరేషన్ కూడా వచ్చింది. మొత్తానికి రవితేజ ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. మరి భవిష్యత్తులో కూడా తన సినిమాల విషయంలో ఇదే ప్లాన్ ను అమలు చేస్తాడేమో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus