#RC15: చరణ్ – శంకర్ ల మూవీ పోస్టర్ కే అంత ఖర్చు.. సినిమాకి ఎంత ఉంటుందో..!

గ్రాండియర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ పేరు చెప్పుకోవచ్చు. అతని సినిమాలను చూసే వాళ్ళకి ఈ విషయాన్ని ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. కమర్షియల్ అంశాలు, మంచి మెసేజ్, మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన హీరోయిజం శంకర్ సినిమాల్లో ఎలా ఉంటుందో భారీ భారీ సెట్టింగ్ లు, విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా పెద్ద పీట వేస్తూ ఉంటారు. రజనీ కాంత్ తో తెరకెక్కించిన 2.0 చిత్రం నిర్మాతలకి , బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.

అయితే కమల్ తో తెరకెక్కించే ఇండియన్ 2 బడ్జెట్ విషయంలో కూడా శంకర్ తగ్గలేదు. అయితే సెట్స్ పైకి వెళ్ళాక శంకర్ బడ్జెట్ ను పెంచేశారని నిర్మాతలు వాపోయారు. దాని సెట్స్ లో భయంకరమైన యాక్సిడెంట్ కూడా జరగడం ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడం జరిగింది.మొత్తానికి రాంచరణ్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు శంకర్. దిల్ రాజు దీనికి నిర్మాత. అతని బ్యానర్ లో 50 వ సినిమా పైగా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది.

కాబట్టి ఈ చిత్రానికి రూ.250 కోట్ల బడ్జెట్ అనుకున్నాడు దిల్ రాజు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ కు సంబందించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనికి పనిచేయబోయే క్యాస్ట్ అండ్ క్రూ ని రివేల్ చేస్తూ ఈ పోస్టర్ ఉంది. అయితే ఈ ఒక్క పోస్టర్ కోసమే రూ.1.73 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. పోస్టర్ బాగానే ఉంది. కానీ పోస్టర్ కే ఇంత అయితే సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత బడ్జెట్ అవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus