ఓ పాపులర్ అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్పినట్టు.. టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది? అంటే.. కొద్ది కాలంగా పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది అని చెప్పొచ్చు.. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ‘ఖుషి’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’, ‘ఒక్కడు’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘వర్షం’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ ఇలా ఈమధ్య కాలంలో వివిధ సందర్భాల్లో పలు సినిమాలు కొత్త హంగులతో, అత్యాధునికి సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..
విచిత్రం ఏంటంటే.. ఇన్ని సంవత్సరాలైనా.. రిలీజ్ అప్పటికంటే రీ రిలీజ్ అప్పుడే ప్రేక్షకాభిమానులు ఎక్కువ ఎంజాయ్ చేశారు.. హంగామా చేశారు.. ఇక దాాదాపు రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసిన ‘చెన్నకేశవరెడ్డి’ కలెక్షన్లను ఛారిటీకి ఇచ్చిన సంగతి తెలిసిందే.. తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టాయి.. ఇక ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, ‘ఖుషి’, 20సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రీ రిలీజ్ చేసిన మహేష్ బాబు ‘పోకిరి’, ‘ఒక్కడు’ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో సత్తా చాటాయి..
ఇదే ఊపులో రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.. జనవరి 26న పవన్ కళ్యాణ్ ‘బద్రి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.. సినిమా బిజినెస్‌లో కానీ వసూళ్లలో కానీ పెద్ద తలకాయగా.. మెయిన్ ఏరియాగా భావించే నైజాంలో.. సెలెక్టెడ్ థియేటర్లలో ఈ ఇద్దరి హీరోల సినిమాలను మళ్లీ విడుదల చేయగా మొదటిరోజు ఎంత రాబట్టాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ట్రేడ్ వర్గాలవారి సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి..