సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి కరోనా కారణమా? ఆయనకు గుండెపోటు రావడానికి కొవిడ్19 వైరస్ మహమ్మారి సృష్టించిన భయాందోళనలు కారణం అయ్యాయా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులు ఆయన్ను ఆందోళనలో నెట్టి మరణం వరకు తీసుకువెళ్లాలని జయప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి సన్నిహితులు చెబుతున్నారు. జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. కాని ఆ గుండెపోటు రావడానికి కారణం మాత్రం కరోనాయే. ఆయనకు తప్ప ఆయన ఫ్యామిలీలో మిగతా అందరూ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారని తెలిసింది.
కుటుంబమంతా కరోనా బారిన పడిందన్న వార్త తెలిసిన తర్వాత జయప్రకాష్ రెడ్డి షాక్ అయ్యారట. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడంతో గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఉదయాన స్నానాల గది కి వెళ్ళినప్పుడు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ విధంగా కరోనా వైరస్ ప్రజల మరణానికి పరోక్షంగా కారణం అవుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నిర్మాతల ప్రాణాలను కరోనా బలితీసుకుంది. ఈతరం ఫిలిమ్స్ పోకూరి రామారావు మృతికి కరోనా కారణమైంది.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్లు సాజిద్-వాజిద్ ద్వయంలో వాజిద్ ఖాన్ 42 ఏళ్ల వయసులోనే కొవిడ్ 19 వైరస్ వల్ల ప్రాణాలు వదిలారు. అయితే ఒక సినీ ప్రముఖుడి మరణానికి కరోనా పరోక్షంగా కారణం కావడం ఇదే తొలిసారి అవ్వవచ్చు. జయప్రకాష్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Most Recommended Video
వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!