రాయలసీమ ప్రాంతంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి పోరాటం చేశారు. నల్లమల అడవుల్ని కేంద్రంగా చేసుకొని వాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు ద్రోహులిచ్చిన సమాచారంతో పాలకులు ఆయనను బందీగా పట్టుకొని, 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. ఈ స్వాతంత్ర సమరయోధుడుగా చిరంజీవి నటించడానికి ఉత్సాహంగా ఉన్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. ఆ స్క్రిప్ట్ మెగాస్టార్ కి నచ్చడంతో దానిని లాక్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయినప్పటికీ ఈ సినిమా సెట్స్ మీదకు ఆగస్టులో వెళుతుంది. మరి మూడు నెలల టైమ్ ఎందుకు తీసుకున్నారని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది.
ఈ సినిమాలో పాత్ర కోసం కొంత బరువు తగ్గాలని చిరు భావిస్తున్నారు. అంతేకాదు గుర్రం మీద కత్తి యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గుర్రపు స్వారీ, కత్తి ఫైట్ పర్ఫెక్ట్ గా రావాలని ప్రతిరోజూ హైదరాబాద్ రేస్ కోర్స్ కు వెళుతున్నట్లు తెలిసింది. మే నుంచి మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. బరువు తగ్గడం, ట్రైనింగ్ కోసం మూడు నెలల సమయం తీసుకున్నారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగధీర, బాహుబలి కి గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్ ని గ్రాఫిక్ హంగులు జోడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.