మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు.. ఏ కథ తో వస్తారు? అని ఎదురుచూసిన అభిమానులు తమిళ చిత్రం “కత్తి” ని రీమేక్ చేస్తున్నారు అని ప్రకటన రాగానే అందరూ నిరుత్సాహపడ్డారు. ఇప్పటికీ అన్నయ్య స్ట్రైట్ మూవీ చేసిఉంటే బాగుండేంది అనే వారు చాలామంది ఉన్నారు. అయితే చిరు ఎంట్రీ మూవీకి కత్తి కథ హండ్రడ్ పర్శంట్ కరక్ట్ అని దర్శకుడు వివి వినాయక్ చెప్పారు. ఖైదీ నంబర్ 150 మూవీ తెరకెక్కించిన ఈ డైరక్టర్ కత్తి కథను తీసుకోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. “కథ అన్నయ్య చిరంజీవితో పాటు నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అందులోని కాయిన్ ఫైట్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి ప్రధాన కారణం అదే. దాన్ని ఖైదీ నంబర్ 150 ఇంకొంచెం కొత్తగా చూపించాం.” అని వివరించారు.
“చిరంజీవి గారి స్థాయి పెరిగింది.. ఆయన సినిమా ఫెయిల్ అయితే ఆ ప్రభావం అనేక మందిపై పడుతుంది. ఆవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సినిమా సక్సస్ అవ్వాలనే ప్రధాన ఉద్దేశంతోటే రీమేక్ చేస్తున్నాం” అంటూ రీమేక్ ఎందుకు? అని ప్రశ్నించేవారికి గట్టి సమాధానం ఇచ్చారు. కథలో లేని అనేక సీన్లు ఇందులో చూస్తారని, ప్రధానంగా బ్రహ్మానందం ట్రాక్ నవ్వులను పంచుతుందని స్పష్టం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150 మూవీ జనవరి 11 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.