ఆ సినిమా ఫ్లాప్ కు అసలు కారణం!!!

టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవ లేదు…చాలామంది ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు…అదే క్రమలో కొందరు టాలెంట్ లేకపోయినా లక్ తో ముందుకు దూసుకుపోతున్నారు…ఇదిలా ఉంటే మ్యూజిక్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యీ….మెల్లగా హీరోగా…..దర్శకుడుగా మారిన ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తాజాగా మనలో ఒకడు అనే సినిమాను తెరకెక్కించాడు….అయితే కధ పరంగా ఆ సినిమాలో చాలా విషయమే ఉంది…కానీ కధనం, యాక్టింగ్ పరంగా సినిమా అంతగా బాగోకపోవడంతో సినిమా డిజాస్టర్ గా మారాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే గతంలో సైతం ఆర్పీ చేసిన ‘బ్రోకర్’ సినిమాకి మంచి మార్కులే పడ్డాయి….కానీ ఆర్ధికంగా మాత్రం నిర్మాత పెద్దగా ఏమీ సంపాదించుకోలేకపోయాడు.

ఇక ఈ సినిమాల్లో కధలు బాగున్నా…సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటే దానికి ప్రధాన కారణం ఆర్పీ పట్నాయక్ అనే వినిపిస్తుంది…కథలు ఎంచుకోవడం లో ఆయన తన మార్క్ ని చూపిస్తున్నా ప్రధాన పాత్రలో తానే నటించడం వలన జనం సరిగ్గా రిసీవ్ చేసుకోవడం లేదు అని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఆయన ప్రధాన పాత్రలో ఉండడం వల్లనే కొన్ని మంచి క‌థ‌లు కూడా జ‌నానికి రీచ్ అవ్వ‌డం లేద‌న్న‌ది కూడా అనువజ్ఞులైన విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రతీ సినిమాకి అన్నీ తానై అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్పీ ఇప్పటికైనా మేల్కోని…మనసు మార్చుకుంటే మంచి కధలను అందరికీ చేర్చే వారధిగా నిలుస్తాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus