కాకినాడకు ఎన్టీఆర్ ఎందుకు వెళ్లారంటే ?

  • December 24, 2016 / 06:44 AM IST

జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేయాలో అని కథలు వింటూ ఇంటికే పరిమితమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హైదరాబాద్ బయట అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి విమానంలో రాజమండ్రికి వెళ్లారు. అక్కడ రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్దకు తారక్ చేరుకోగానే అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆనందంతో ఎన్టీఆర్ తో కలిసి రోడ్ ర్యాలీ నిర్వహించారు. అటునుంచి కాకినాడకు వెళ్లారు. వీరి వెంట కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. అనుకోకుండా సాగిన ఈ టూర్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇతర పార్టీ నాయకుల గుండెల్లో మాత్రం గుబులు రేపింది. ఆయన రావడం వెనుక పెద్ద రాజకీయకోణం ఉంటుందని ఆందోళన చెందారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయ విషయం గురించి  వెళ్లలేదని తెలిసింది. కాకినాడలోని హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ఇంటిలో కార్యక్రమం కోసం ఆయన వచ్చారని సమాచారం. కొంతకాలం క్రితం జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు తారకరామారావుకి పంచెకట్టు కార్య క్రమం శుక్రవారం  నిర్వహించారు. అందుకే ఇద్దరు బాబాయ్ (ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్) లు హాజరయ్యారు. అంతదూరం వెళ్లినందున లక్ష్మి ప్రణతి కుటుంబ సభ్యుల ఇంటికి కూడా ఎన్టీఆర్ వెళ్లి పలకరించి వచ్చారు. అదండీ నిన్న ఎన్టీఆర్ టూర్ వెనుక అసలు కారణం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus