కాటమరాయుడు షూటింగ్ లో పవన్ కి కోపం రావడం వెనుక అసలు కారణం
- October 28, 2016 / 09:33 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఆయనకు నటనలోనే కాకుండా రైటింగ్, డైరెక్టింగ్ విషయాలపై పట్టుంది. అందుకే కథ సాగే విధానం, టేకింగ్ విషయంలో అతన్ని మెప్పు పొందేలా చేయడానికి ఎంతో ప్రతిభవుండాలి. తీసే సీన్ పై దర్శకుడికి క్లారిటీ లేదంటే పవన్ ఆగ్రహానికి గురికావాల్సిందే. కాటమరాయుడు షూటింగ్ లో పవన్ కోపంగా మాట్లాడడం వెనుక ఇటువంటి కారణమే ఉన్నట్లు తాజాగా తెలిసింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ సికింద్రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
గత సోమవారం షూటింగ్ కి హాజరైన పవర్ స్టార్ కి ఆరోజు యాక్షన్, డైలాగ్ పేపర్ ని డైరక్టర్ టీమ్ అందించలేదని, మధ్యాహ్నం అవుతున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో కోపంతో సెట్స్ లోకి వచ్చిన పవన్ ఆగ్రహంతో డైరక్టర్ పై అరిచారని వార్త బయటికి వచ్చింది. అయితే అక్కడ జరిగిన విషయం వేరంట. పవన్ కి చెప్పిన సీన్ ఒకటైతే.. షూట్ చేసే సీన్ మరొకటి అంట.. పోనీ ఆ సీన్ చేద్దామనుకుంటే .. ఇది వరకు ఉన్న డైలాగులు లేవంట.. దీంతో తనకి చెప్పకుండా అన్నీ మార్చేస్తుండడంతో కోపం వచ్చి పవన్ కళ్యాణ్ డాలీ పై కోప్పడినట్లు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయ విషయాలతో ఒత్తిడిలో ఉన్న ఈ సమయంలో డాలీ సొంత నిర్ణయం తీసుకోవడం పవర్ స్టార్ కు మరింత చిరాకుతెప్పించిందని వారు వివరించారు. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న కాటమరాయుడు ఉగాది కానుకగా మార్చి 29 న రిలీజ్ కానుంది.
















