పైన ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఎస్.. మీ అంచనా కరెక్ట్. ఒక్క సినిమాతోనే యువతను ఆకట్టుకున్న రవి కృష్ణ . మరి ఇలా ఎందుకు అయ్యారని అనుకుంటున్నారా?.. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం చిన్న కుమారుడు రవి కృష్ణ 7 /జి బృందావన్ కాలనీ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యారు. తన నటన, డైలాగ్ డెలివరీ అందరి మెప్పు అందుకుంది. ఇలా తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సాధించారు. ఆ తర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు, రేపు వంటి తెలుగు సినిమాలు చేశారు. ఇవి ఘోర పరాజయం పాలయ్యాయి.
అలాగే తమిళంలో చేసిన చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. డ్రగ్స్ కి బానిసై సినిమాలకు దూరమయ్యారు. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ డ్రగ్స్ భూతం నుంచి బయటపడలేకపోయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రీసెంట్ గా వైద్యుల సాయంతో మామూలు మనిషి అయ్యారు. గత ఏడాది తన అన్న జ్యోతి కృష్ణ (డైరక్టర్), ఐశ్వర్య పెళ్లి సమయంలో కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవి కృష్ణ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.