NTR-NEEL : ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ సడెన్ గా వాయిదావేయటం వెనుక కారణం ఏంటో తెలుసా..?
- January 21, 2026 / 04:02 PM ISTByFilmy Focus Desk
‘దేవర’ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో లో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా తమ ప్రీవియస్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించారు. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో మీద సినీ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఆన్లైన్ లో ట్రేండింగ్ లో ఉంది. ఈ మూవీ షూటింగ్ ని సడన్ గా వాయిదా వేశారంటే చిత్ర బృందం.. కాగా దానికి పలు కారణాలతో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ వార్తల్లో నిజం ఎంత అనేది చూసేద్దామా?
NTR-NEEL
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఒకటి. ఈ చిత్రానికి సంబందించిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ కొరకు రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారట దర్శకుడు నీల్. అలా రెస్ట్ సరిగ్గా లేకపోవటంతో మరియు వాతావరణ ప్రభావంతో హీరో ఎన్ఠీఆర్ కు తీవ్రమైన జలుబు, జ్వరం తో ఇబ్బంది పడుతున్నారట. ఇది తెలుసుకున్న చిత్ర యూనిట్ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనదని భావించి షూటింగ్ కి సడన్ బ్రేక్ ఇచ్చారని వినికిడి. ఎన్ఠీఆర్ ను ఇంట్లో విశ్రాంతి తీసుకోమన్నారట, పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ లో పాల్గొనవచ్చు అని తెలిపినట్టు సమాచారం.

సాధారణంగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎపిసోడ్లు ఎవ్వరికి అందనంత స్థాయిలో తెరకెక్కిస్తారు. ఇక ఆయనకి యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ తోడవటంతో ఈ సినిమాలో ఆక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టగా, ఇంత వరకు ఆఫిసియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాగా ఈ మూవీ లో కాంతారా బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.














