ఆర్ధిక అవసరాల కోసమే రీ ఎంట్రీ అంటున్న పవన్

పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన రీ ఎంట్రీ పై నోరు విప్పారు. కారణం ఇదే నంటూ చెప్పుకొచ్చారు. విషయంలోకి వెళితే… పవన్ స్థాపించిన జనసేన పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా ఉంటూ నమ్మిన బంటులా పనిచేసిన జే డి లక్ష్మీ నారాయణ నిన్న సడన్ గా పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ, పవన్ కి పంపించారు. తన ఈ నిర్ణయానికి పవన్ ప్రవర్తనే కారణమన్నారు. సినిమా జోలికి వెళ్ళేది లేదు, ప్రజా సేవకే జీవితం అంకితం అన్న పవన్ మళ్ళీ సినిమాలలోకి వెళ్లడం నచ్చలేదు అని… రాజీనామాకు గల కారణాన్ని జే డి చెప్పుకొచ్చారు. పవన్ ది నిలకడ లేని స్వభావం అని కొంచెం గట్టిగానే విమర్శించారు.

ఈ నేపథ్యంలో లో పవన్ రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. తనకు మిగతా రాజకీయ నాయకుల వలే… పరిశ్రమలు, స్థిరాస్థులు లేవని, పార్టీను నడపాలన్న, నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలన్న డబ్బులు కావాలని, అందుకే సినిమాలలో నటిస్తున్నాను అని వివరణ ఇచ్చుకున్నారు. ఫైనల్ గా ఆర్థిక అవసరాల కోసం సినిమాలు తీస్తున్నానంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి పవన్ రాజకీయాలలో ఉన్నప్పటికీ, సినిమాలు తీయకూడదని ఎవరు అడగలేదు. ఆయనే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆడిన మాట తప్పడం ఎందుకు అనేదే.. జేడీ ప్రశ్న.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus