అందుకే హిందీ సినిమాలకు దూరమయ్యాను : రమ్య కృష్ణ

  • June 22, 2020 / 04:24 PM IST

సౌత్ లో ఇప్పటికీ తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది రమ్యకృష్ణ.హిందీ లో కూడా ‘కల్‌నాయక్‌’ (1993), ‘క్రిమినల్‌’ (1995), ‘శాపత్‌’ (1997), ‘బడే మియా చోటే మియా’ (1998) వంటి చిత్రాలలో నటించి ఆమె నటనతో అక్కడి ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తరువాత రమ్య కృష్ణ హిందీ సినిమాల్లో నటించలేదు. ఎన్నో ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ విషయం పై రమ్య కృష్ణ స్పందిస్తూ.. ‘నిజానికి నేను నటించిన హిందీ సినిమాలు పెద్దగా ఆడలేదు.

తరువాత వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. ఆ కారణంగానే ఇన్నేళ్ల పాటు హిందీ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను.అయితే సౌత్ లో మాత్రం సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ‘బాహుబలి’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను మరోసారి పలకరించి అలరించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) తో కూడా హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది రమ్య కృష్ణ.ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ..

“ఈ చిత్రానికి బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్ ‌కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఇది కచ్చితంగా మరో ‘బాహుబలి’ అవుతుంది’ అంటూ ధీమా వ్యక్తం చేసింది రమ్యకృష్ణ.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus