రవితేజ సినిమా ఆగిపోయింది!

తమిళంలో జయం రవి, అరవిందస్వామి కీలకపాత్రల్లో రూపొంది ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రం “బోగన్”. నిజానికి యావరేజ్ సినిమా అయినప్పటికీ.. జయం రవి-అరవిందస్వామీలు కలిసి నటించిన మునుపటి చిత్రం “తని ఒరువన్” (తెలుగులో “ధృవ”) సూపర్ హిట్ అవ్వడంతో ఆ క్రేజ్ తో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయింది. 2016లో తమిళనాట విడుదలైన ఈ చిత్రాన్ని అప్పట్నుంచి తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తూనే ఉన్నారు. మన యువ హీరోలు చాలా మంది ఈ రీమేక్ లో నటించడానికి ఉవ్విళ్ళూరినప్పటికీ.. ఎట్టకేలకు ఆ ప్రొజెక్ట్ రవితేజ చేతిలో పడింది. నిర్మాణ సంస్థ మొదలుకొని హీరోయిన్, టెక్నీషియన్స్ అందరి లిస్ట్ ప్రిపేర్ అయిపోవడంతోపాటు.. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైన ఈ చిత్రాన్ని అర్ధాంతరంగా ఆపేయమన్నాడట రవితేజ.

అందుకు కారణం ఏంటంటే.. తమిళ వెర్షన్ లో టైటిల్ రోల్ పోషించిన అరవింద స్వామి మళ్ళీ తెలుగు రీమేక్ లో అదే పాత్రను పోషించడానికి ససేమిరా అన్నాడట. దాంతో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రాజశేఖర్ వంటి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. రవితేజ మాత్రం “అరవిందస్వామి చేస్తేనే నేను నటిస్తాను లేదంటే లేదు” అని తేల్చి చెప్పేశాడట. ఏకంగా హీరో ఇలా ఖరాకండిగా చెప్పేయడం, అటు అరవిందస్వామి కూడా సానుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు రీమేక్ చేయాలన్న ఆలోచనను ఆపేశారట. కొన్నాళ్ళ తర్వాత ఎవరైనా కొత్త హీరోనో లేక మరెవరైనా యంగ్ హీరోనో ఈ సినిమాను రీమేక్ చేయొచ్చేమో కానీ.. ప్రస్తుతానికైతే “బోగన్” రీమేక్ ఆగిపోయినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus