సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణం ఇదేనా?

  • September 4, 2022 / 02:44 PM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచే సినిమాలతో పోల్చి చూస్తే డిజాస్టర్లుగా నిలిచే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా ట్రెండింగ్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుండటంతో నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. బాయ్ కాట్ కల్చర్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బాయ్ కాట్ కల్చర్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. సరైన కథ, కథనం లేకపోవడం వల్లే సినిమాలు ఫ్లాపులు, డిజాస్టర్లు అవుతున్నాయని అంతకు మించి సినిమాలు ఫ్లాప్ కావడం వెనుక ప్రత్యేకమైన కారణం అయితే ఏమీ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సినిమా బాగుంటే బాయ్ కాట్ పిలుపును సాధారణ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని నెటిజన్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అయ్యాయి.

అయితే లైగర్ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. లైగర్ ప్రేక్షకులను మెప్పించేలా లేకపోవడంతో రెండో రోజు నుంచి కలెక్షన్లు తగ్గాయి. కంటెంట్ మాత్రమే సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కంటెంట్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంబినేషన్లను నమ్ముకుని సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం సినిమాలు భారీ మొత్తంలో నష్టాలను మిగులుస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

కొంతమంది మాత్రం తమ సినిమాలు ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోకపోతే ఈ తరహా ప్రచారాన్ని సాకుగా చూపుతున్నారు. మంచి కంటెంట్ తో తెరకెక్కితే హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం. దసరా వరకు స్టార్ హీరోల స్ట్రెయిట్ సినిమాల రిలీజ్ లు లేకపోవడంతో థియేటర్ల ఓనర్లు దిగులు చెందుతున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus