ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ బ్యానర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్లుగా యాక్టివ్ గా ఉన్న ఈ సంస్థపై తొలిసారి ఐటీ రైడ్ జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో పలు క్రేజీ సినిమాలు తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమాతో ఈ బ్యానర్ ప్రస్థానం టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలు కాగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లతో ఈ బ్యానర్ కు సత్సంబంధాలు ఉన్నాయి.
ఒక ట్రాన్సాక్షన్ వల్లే మైత్రీ (Mythri Movie Makers) సంస్థపై దాడులు జరిగాయని తెలుస్తోంది. ముంబైకు చెందిన ఒక సంస్థతో మైత్రీ సంస్థ చేసిన లావాదేవీ ఈ సమస్యకు కారణమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మైత్రీ సంస్థ తెలుగులో దాదాపుగా క్రేజ్ ఉన్న అందరు హీరోలతో సినిమాలు చేస్తోంది. సరైన ప్లానింగ్ తోనే ఈ ఐటీ రైడ్స్ జరిగాయని సమాచారం అందుతోంది. మైత్రీ సంస్థల్లో ప్రముఖ రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నాయని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఈ ఐటీ రైడ్స్ గురించి మైత్రీ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మైత్రీ సంస్థ పుష్ప2 సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సంస్థలో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కనున్నాయి. చాలామంది స్టార్ హీరోల దగ్గర మైత్రీ సంస్థ అడ్వాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల నిర్మాణం దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది.
మైత్రీ సంస్థకు ఇండస్ట్రీలో క్రేజ్ ఉంది. సినిమాల ద్వారా మైత్రీ నిర్మాతలకు భారీ స్థాయిలోనే లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. మైత్రీ సంస్థ రాబోయే రోజుల్లో పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలను నిర్మించనుందని కామెంట్లు వినిపించాయి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!