NBK107: బాలయ్య మూవీ విషయంలో మైత్రి ప్లానింగ్ ఇదేనా?

సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ నుంచి పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినా టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోవడం, తాజాగా రిలీజైన పోస్టర్ అఖండ సినిమాలోని బాలయ్య పాత్రను పోలి ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ ఫీలయ్యారు. బాలయ్యను కొత్తగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ నిర్మాతలు, గోపీచంద్ మలినేని మరో లుక్ ను కావాలనే దాచిపెట్టారని తెలుస్తోంది. గతంలో బాలయ్య బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్న పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కన్నడ సినిమాను పోలి ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. మరోవైపు ముందుగా పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచన లేకపోవడంతో తాజాగా రిలీజ్ చేసిన స్టిల్ విషయంలో మేకర్స్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం.

టీజర్ లేదా ట్రైలర్ లో బాలయ్య మరో లుక్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని అయితే రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో వాటిని రివీల్ చేయడం లేదని తెలుస్తోంది. స్టార్ హీరో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్, మరికొన్ని విషయాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం గోపీచంద్ మలినేని స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య సినిమా తర్వాత గోపీచంద్ మలినేని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus