Regina: బ్లేజర్ లో కళ్లు చెదిరే అందాలతో కుర్రాళ్లను మనస్సును కట్టిపడేస్తున్న హీరోయిన్ రెజీనా..!

పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా కాసండ్రా. మొదటి సినిమా నుంచే గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రంతో భారీ క్రేజ్ అందుకుంది. తర్వాత ఎవరు చిత్రంలో బోల్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి ఔరా అనిపించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించి మెప్పించింది.

ఇక చివరగా రెజీనా (Regina) శాకినీ డాకిని అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేద థామస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతమేరకైనా గ్లామర్ ఒలకబోయడానికి ఆమె వెనకడుగు వేయదు. అలాగని కేవలం ఆమె గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

కానీ ఆ చిత్రం ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. ఆరబోసిన అందాలన్నీ వృధా అయ్యాయి. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో కూడా తాను యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా రెజీనా ఐ డబ్ల్యుఎం బజ్ అవార్డ్స్ అనే ఈవెంట్ కి హాజరైంది.

ఆమెతో పాటు పలువురు బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు హాజరయ్యారు. సౌత్ నుంచి రెజీనా, రాశి ఖన్నా, రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ వేడుకలో రెజీనా కూడా అవార్డు అందుకుంది. స్మైలింగ్ ఫేస్ తో రెడ్ కార్పెట్ పై ఆమె వరద పారించింది. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా రెజీనా కళ్లు చెదిరేలా హొయలు పోయింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus