సింగర్ స్మిత.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేని పేరు.. ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్, యాక్ట్రెస్, హోస్ట్ అండ్ బిజినెస్ వుమెన్‌గా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో రాణించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారామె. అలాగే తమ స్వశక్తితో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. విజయవాడకు చెందిన స్మిత 1997లో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ‘పాడుతా తీయగా’ తో సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె రూపొందించిన ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తెలుగులో, ఆ జనరేషన్‌లో ఫస్ట్ పాప్ సింగర్ స్మితనే కావడం విశేషం.. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ మూవీతో నటిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడలోనూ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు. ఛార్మీ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రంలో పాడిన ‘ఎవరైనా చూస్తుంటారా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అందుకున్నారామె..కొంత గ్యాప్ తర్వాత ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 10 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో పాపులర్ సినీ,
పొలిటికల్ అండ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ని ఇంటర్వూ చేయబోతున్నారు స్మిత.. ఈ సందర్బంగా పలు మీడియా, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వూలిచ్చారామె. తన పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే స్మిత ప్రేమ వివాహానికీ, అక్కినేని కుటుంబానికీ సంబంధం ఉందని తెలిసింది..ఇక మీ విషయంలో మీ భర్త సపోర్ట్ ఎలా ఉంటుంది? అని అడిగితే ఇలా చెప్పుకొచ్చారు స్మిత.. ‘‘నా విషయంలో హస్బెండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.
మా ఆయన నా వాయిస్‌కి పెద్ద ఫ్యాన్. ఆయన పేరు శశాంక్. మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు.. ఎందుకంటే.. నాకున్న ఫ్రెండ్ సర్కిల్‌లో ఆయన కూడా ఒకరు. మా ఫ్రెండ్స్ అంతా ఆయన్ని బావ అంటారు. నేను కూడా అంతే. అయితే.. మా మ్యారేజ్ అయ్యేటప్పటికి నా వయసు 21 ఏళ్ళు. మా లవ్ మేటర్ అక్కినేని వెంకట్ (నాగార్జున అన్నయ్య) గారు దగ్గరుండి సెట్ చేశారు. మా రెండు ఫ్యామిలీస్‌తో ఆయనే మాట్లాడి ఒప్పించారు. మాకిప్పుడు పాప శివి’’..