తారక రత్న పుట్టినరోజు నాడు బాలయ్యతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..!

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాలు ఇంకా షాక్‌లోనే ఉన్నాయి.. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు శివైక్యం అయ్యారు.. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తారక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..

రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. పాదయాత్రలో లోకేష్‌కు అండగా నిలబడాలని.. మళ్లీ ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయాలని.. భారీ ప్రణాళిక వేసుకున్నారు తారక రత్న.. కానీ దేవుడి ప్రణాళిక వేరుగా ఉంది.. పార్టీ వర్గాల వారు, నందమూరి అభిమానులు ఆయన ఇక లేరు అనే మాట అబద్ధం అయితే బాగుండు అని కోరుకుంటున్నారు.. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 22 తారక రత్న పుట్టినరోజు.. 1983 ఫిబ్రవరి 22న జన్మించారాయన..

2023 ఫిబ్రవరి 22 నాటికి 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టేవారు.. కానీ.. నాలుగు రోజుల ముందు.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు.. ‘‘ఇవాళ మీ 40వ పుట్టినరోజు.. ఈసారి ఫ్యామిలీ (భార్య బిడ్డలు), బాల బాబాయ్, ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా సంబరాలు జరిగేవి.. జన్మదినం నాడు జయంతి శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు అన్నా’’ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.. గతంలో బాలయ్యతో బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్న ఫోటోలు షేర్ చేస్తూ..

ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.. పెళ్లి తర్వాత కుటుంబానికి దూరంగా ఉన్న సమయంలో తారక్ పుట్టినరోజుకి ఆయన భార్య అలేఖ్య రెడ్డి, బాలయ్యకి ఫోన్ చేసి ఆహ్వానించగా ఆయన అబ్బాయ్‌తో కేక్ కట్ చేసి.. సరదాగా గడిపారు.. ఆ పిక్స్ చూస్తే.. బాబాయ్ – అబ్బాయ్ మధ్య బాండింగ్ ఏంటనేది అర్థమవుతుంది.. నారా రోహిత్, సీనియర్ నటి సుమలత, నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఆరోజు తారక రత్న జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus