ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్ లెక్కలు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ఇక బాహుబలి సినిమా తో రెండు వేల కోట్లు మార్కెట్ ను చూపించిన దర్శకుడు రాజమౌళి మరోసారి అంతకుమించి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలను క్రియేట్ చేయబోతున్నాడు.RRR సినిమాకు 450 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగానే క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ స్థాయిలో పెట్టడానికి కారణం ఏమిటి అనే విషయాలపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
అంతేకాకుండా హీరోలకు రెమ్యునరేషన్స్ ఎవరికి ఎంత ఇచ్చారు అనే టాపిక్స్ కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి ఎక్కువగా ప్రాఫిట్స్ అందుకునే అవకాశం ఉంది. ఆయనకు ఏ స్థాయిలో అయినా సరే పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. కానీ రాజమౌళి అలా కాకుండా సినిమా పూర్తయిన తర్వాత బిజినెస్ ను బట్టి వాటా తీసుకునేలా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సినిమాకు ఆయన 30 శాతానికి పైగా లాభాల్లో వాటా అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోలిద్దరికీ కూడా సమానంగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పాత్రల కోసం ఈ హీరోలకు ఒక్కొక్కరికి 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో ఆయనకు 25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా సమాచారం.
ఇక ఎంతో ఇష్టంగా RRR సినిమాలో నటించిన అలియా భట్ 9 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన బడ్జెట్లో దాదాపు 200 కోట్ల వరకు నటీనటులకు అలాగే ఇతర టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేశారట. సినిమా ప్రొడక్షన్ లో లో భాగంగా 230 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక మరో 20 కోట్ల వరకు ప్రమోషన్స్ కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!