ఆ రోజుల్లోనే చిరు, శ్రీదేవి లు .. అంత తీసుకున్నారా?

  • May 14, 2020 / 08:00 AM IST

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం గొప్పతనం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే చెప్పాలి.1990 వ సంవత్సరం మే 9న విడుదలైన ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చెయ్యగా.. అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2000 వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అయినా 2010 వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అయినా.. అమితంగా ఇష్టపడతారు అనడంలో అతిశయోక్తి ఉండదు. అంతలా ఓ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

రాజు అనే పాత్రలో మెగాస్టార్, దేవకన్య పాత్రలో శ్రీదేవి, మాంత్రికుడు పాత్రలో అమ్రిష్ పూరి. తమ నటనలతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.. కనీసం వి.ఎఫ్.ఎక్స్ లు ఉపయోగించకుండా ఈ చిత్రాన్ని క్లాసిక్ గా మలిచారు. ఇదిలా ఉండగా.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి లు ఎంతెంత పారితోషికం తీసుకున్నారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

అయితే చిరు ఈ చిత్రానికి 35 లక్షలు పారితోషికం అందుకోగా.. శ్రీదేవి 25 లక్షలు అందుకున్నారట. బాల్కని టికెట్ 6 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఈ చిత్రం 8కోట్లు షేర్ ను కలెక్ట్ చేసిందట. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ మరింతగా పెరిగిందట. ఆయన మార్కెట్ మాత్రమే కాదు తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. మిగితా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చెయ్యగా అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వడం ఓ రికార్డు అనే చెప్పాలి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus