Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రముఖ గీత రచయిత కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!

ప్రముఖ గీత రచయిత కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!

  • November 10, 2025 / 12:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ గీత రచయిత కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!

ప్రముఖ కవి, రచయిత అందె శ్రీ (64) ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందెశ్రీ సినిమా పాటల రచయితగానే కాకుండా, తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Ande Sri

అందె శ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. జులై 18, 1961న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా తన జీవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత రోజుల్లో భవన నిర్మాణ కార్మికుడిగానూ పనిచేశారు. అలా పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ‘మాయమైపోతున్నడమ్మా…’ అనే గీతంతో పేరు తెచ్చుకున్నారు. ఇక అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించి రూ.కోటి పురస్కారం కూడా అందించింది..

renowned writer ande sri is no more

ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. ఆర్‌.నారాయణమూర్తి సినిమాల్లో పాటలు ఎక్కువగా రాసేవారు. 2006లో ‘గంగ’ సినిమాకుగాను నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ నుండి డాక్టరేట్‌ అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం రాగా.. రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా అదే ఏడాది అందుకున్నారు. వీటితోపాటు జానకమ్మ జాతీయ పురస్కారం ( 2022), దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2024) కూడా వచ్చాయి. లోక్‌నాయక్‌ పురస్కారాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

renowned writer ande sri is no more

అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ande Sri

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

16 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

22 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version