Renu Desai: ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేసిన రేణూ దేశాయ్ పోస్ట్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ చేసే పోస్ట్ లు తెగ వైరల్ అవుతుంటాయి. మూగజీవులంటే రేణూ దేశాయ్ కు ఎంతో ఇష్టం కాగా మూగ జీవులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆమె తట్టుకోలేరనే సంగతి తెలిసిందే. పాల కోసం గేదెలు, ఆవులను ఎలా హింసిస్తారో, కోళ్లను మేకలను చంపేయడం గురించి రేణూ దేశాయ్ వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది.

అయితే గతంలో రేణూ దేశాయ్ వీడియోలపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తం కాగా ఆ కామెంట్లకు రేణూ దేశాయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి తనకు పంపిన మెసేజ్ ద్వారా ఆ ప్రశ్నలకు సంబంధించి రేణూ దేశాయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ మెసేజ్ లో ఒక వ్యక్తి రేణూ దేశాయ్ గారు షేర్ చేసే వీడియోలను చూసి నేను షాకయ్యానని వెల్లడించారు.

నేను ఆ వీడియోలను నేను చూడలేకపోయానని సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఆ వీడియోలను చూసినప్పటి నుంచి మాంసాహారం తినడం మానేశానని ఆ వ్యక్తి అన్నారు. నాన్ వెజ్ తినాలనే ఆలోచన కూడా రావడం లేదని సదరు వ్యక్తి వెల్లడించారు. ఆ మెసేజ్ గురించి రేణు స్పందిస్తూ మనుషులలో ఈ మార్పు కోసమే తాను ఈ పోస్ట్ లు పెడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. పావుగంట నాలుక రుచి కోసం జంతువులను చంపేస్తున్నామా? అని ఆమె కామెంట్లు చేశారు.

మూగజీవాల విషయంలో ఆలోచించాలని (Renu Desai) రేణూ దేశాయ్ వెల్లడించారు. రేణూ దేశాయ్ తన పోస్ట్ ల ద్వారా మంచి మనస్సును చాటుకుంటున్నారు. రేణూ దేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణూ దేశాయ్ నటిస్తుండగా ఈ సినిమాతో రేణూ దేశాయ్ కు భారీ సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus