అకీరా నందన్ సినిమాల్లోకి రాకుండానే బాగా ఫేమస్ అయిపోయాడు. 6.5 అడుగుల పర్సనాలిటీ. పైగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు. చూడటానికి చాలా బాగుంటాడు. అభిమానులకి ఇంతకంటే ఏం కావాలి. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం లేదు. చేసినవి రిలీజ్ అవుతాయి. తర్వాత ఆయన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఆ లోటుని పూడ్చాల్సిన బాధ్యత అకీరా పై కూడా ఉంది.
కానీ అతని తల్లి రేణు దేశాయ్ (Renu Desai) పవన్ కళ్యాణ్ అభిమానులని ఎప్పటికప్పుడు డిజప్పాయింట్ చేస్తూనే ఉంది. అకీరాకి నటనపై ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఆమె ప్రతి సందర్భంలో చెబుతూ వస్తుంది. అది కరెక్ట్ కాదు అని అభిమానులు వాదిస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ‘ఓజి’ సినిమాలో అకీరా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అంతేకాదు రాంచరణ్ (Ram Charan) నిర్మాణంలో అఖిల్ ఒక సినిమా చేసే అవకాశం కూడా ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ 2 అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ‘ ‘ఓజి’ (OG) లో అకీరా నటిస్తున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. అలాగే చరణ్ నిర్మాణంలో అకీరా డెబ్యూ ఉంటుంది అనే దాంట్లో కూడా నిజం లేదు. అకీరా సినిమాల్లోకి వస్తే ముందుగా సంతోషించేది నేనే. అప్పుడు నేనే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ విషయాన్ని ముందుగా ప్రకటిస్తాను. కానీ అకీరాకి ఇప్పుడు నటనపై ఆసక్తి లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ మరోసారి మెగా అభిమానులను డిజప్పాయింట్ చేశాయి అని చెప్పాలి.