రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌లు కొంత కాలం కాపురం చేసి ప్రస్తుతం విడి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా ఆమె రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
అయితే ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’లో రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనపై వస్తోన్న నెగెటివ్ కామెంట్స్ గురించి స్పందించారు. “వర్క్, షూటింగ్ విషయాల్లో నేను చాలా పర్టిక్యూలర్ గా ఉంటాను.
మనకు సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి మన మీద డబ్బు ఖర్చు చేస్తున్నారంటే దానికి మనం కచ్చితంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. ఉదాహరణకి షూటింగ్ టైంలో నా కాస్ట్యూమ్ విషయంలో తేడా జరిగితే అప్పుడు నేను కాస్ట్యూమ్ డిజైన్ చేసిన పర్సన్ ని తిడతాను. ఒకటి రెండుసార్లు మంచిగా చెప్తాను. వినకపోతే మూడోసారి తిట్టాల్సి వస్తుంది. మొదట్లో అయ్యా, బాబు అంటే వినరు. తిడితేనే వాళ్లకు గుర్తుంటుంది. అప్పుడు పని జరుగుతుంది. నేను ఈరోజు వరకు నా జీవితంలో నా సొంత పిల్లల్ని కూడా కొట్టలేదు. కనీసం దోమల్ని కూడా చంపను.
అలాంటి వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు మట్లాడుతున్నారు. మనం ఎంత మంచి చేసినా మన వెనకాల చెడుగా మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు. అవి విన్నప్పుడు మొదట్లో నేను అలా కాదు, ఇలా కాదు అని వాదించేదాన్ని. కానీ ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడుకోండి. అది నాకు అనవసరం. నన్ను అర్థం చేసుకునే నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటే చాలు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదు” అని చెప్పుకొచ్చారు (Renudesai) రేణు దేశాయ్.