ప్రస్థానం వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దేవకట్ట ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని రిపబ్లిక్ సినిమాతో రాబోతున్నాడు. గతంలో చేసిన కమర్షియల్ మిస్టీక్ ఈ సినిమాలో చేయలేదని అంటూ ఇప్పటికే సినిమాకు ప్రమోషన్ బాగానే చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ తో సినిమాకు హైప్ కూడా బాగానే క్రియేట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ఈ సినిమా పై ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేది మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ తో క్లారిటీ వచ్చేస్తుంది. శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతుండటం విశేషం. తెలంగాణలో 215 థియేటర్స్ లో విడుదల అవుతుండగా ఆంధ్రప్రదేశ్లో 350కి పైగా థియేటర్లలో భారీగా విడుదల అవుతోంది అయితే టికెట్ల రేట్లు విషయంలో మాత్రం పెద్దగా మార్పు అయితే రాలేదు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 600కు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 740 కి పైగా థియేటర్లలో రిపబ్లిక్ సందడి చేయబోతోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13.6కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలవుతోంది. అంటే బాక్స్ ఆఫస్ వద్ద 14 కోట్ల షేర్ అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించినట్లు లెక్క. మరి ఈ సినిమా ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.