నడిరోడ్డుపై మనిషిని చంపడం, అదే నడిరోడ్డుపై ఓ నిస్సహాయురాలైన ఆడదాన్ని మిట్టమధ్యాహ్నం బలాత్కారం చేస్తే సదరు నీచమైన-హేయమైన కార్యాన్ని అడ్డుకోకపోగా.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంజాయ్ చేస్తున్న తరుణంలో థియేటర్లలో జాతీయగీతం సినిమా ఆరంభంలో ప్లే చేయాలని, అందరూ తప్పనిసరిగా జాతీయగీతం ప్లే అవుతున్నప్పుడు నిల్చోవాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసినప్పుడు చాలామంది “అవసరమా” అని ఇష్యూని కామెడీ చేసేయగా.. కొందరు మాత్రం “పోన్లెండి కనీసం ఇక్కడైనా జాతీయ గీతానికి గౌరవం దక్కుతుంది” అని ఆనందపడినవారు కూడా ఉన్నారు. అయితే.. మళ్ళీ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ “జాతీయ గీతం ప్లే అయినప్పుడు నిల్చోవాల్సిన అవసరం లేదు” అని సరికొత్త తీర్పునిచ్చింది.
దాంతో మళ్ళీ ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ విషయమై ఇటీవల సన్నీలియోన్ స్పందించింది. “జాతీయ గీతానికి లేచి నిల్చోవడం భారతీయులుగా మన బాధ్యత, ఏదో కోర్ట్ చెప్పింది అని కాదు.. భారతీయులుగా పుట్టినందుకు మన జాతీయ గీతాన్ని గౌరవించుకోవాలి” అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ విషయమై కొందరు సన్నీలియోన్ ను ట్విట్టర్ లో ట్రోల్ చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో జనాలు మాత్రం సన్నీ దేశభక్తికి నీరాజనాలు పలికారు.