‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh Daggubati) ,ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).ల నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లి రాజు పాత్రతో..! రేవంత్ (Revanth) అనే పిల్లాడు ఈ పాత్ర చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్ర పై కొంతమంది ఆడియన్స్ కంప్లైంట్స్ చేస్తున్నారు.
Revanth
‘చిన్న పిల్లలతో పెద్ద వాళ్ళ పై దురుసుగా మాట్లాడటం’ వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడై పోతారు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లి రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం.! నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థాంక్యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘నాలా ఓటీటీలు చూసి ఎవ్వరూ పాడైపోకూడదు.. ఎవ్వరూ నాలా తిట్టకూడదు’ అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం.
అది ఎవర్నైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావిపూడి గారికి థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క బుల్లి రాజు పాత్ర గురించి అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. ” ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ‘అలాంటి కంటెంట్ కి పిల్లలను దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి?’ అనేది బుల్లి రాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.