బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎంటర్ టైన్మెంట్ కి అడ్డా కాదు ఫైటింగ్ కి అడ్డా. మాటలతోనే ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి. ఇందులో అపార్ధాలు చేసుకునేవి చాలానే ఉంటాయి. అదే అపార్ధం చేసుకుని ఆరోహి రెచ్చిపోయి మరీ రేవంత్ ని రెచ్చగొట్టింది. అసలే ఏడుగురు నామినేషన్స్ చేశారన్న ఫ్రస్టేషన్ లో ఉన్న రేవంత్ ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. అసలు మేటర్లోకి వెళితే., బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ స్టార్ క్విజ్ టాస్క్ ఇచ్చాడు. రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ విడిపోయి హాట్ స్టార్ లో వచ్చే సినిమాలపై ప్రశ్నలకు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి.
ఇక్కడే ఒకటీమ్ నుమంచీ స్రీసత్య బజర్ నొక్కడానికి వచ్చింది. ఆరోహి నేను వెళ్తాను అంటూ ముందుకు వచ్చింది. అయితే, రేవంత్ సలహా ఇచ్చాడు. స్పీడ్ గా ఉండాలి, .యాక్టివ్ గా బజర్ నొక్కాలి. ఆన్సర్ తెలిసుండాలి అంటూ నస పెట్టాడు. దీంతో ఆరోహికి కాలింది. నేను వెళ్లను నువ్వు వెళ్లు అంటూ మాట్లాడింది. కానీ, పక్కనే ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. రేవంత్ కూడా ఎంకరేజ్ చేసి మరీ పంపాడు. ఎట్టకేలకి ఆరోహి ఆడటానికి వచ్చింది. ఆరోహి గేమ్ ఓడిపోయింది.
దీంతో రేవంత్ అందుకే యాక్టివ్ గా ఉండాలి అని, గేమ్ అనేది మనం ఎంతమంది ఉన్నాం అనేది ఓట్లు కాదు మనకి వచ్చా లేదా అనేది చూసుకుని వెళ్లాలి అంటూ స్ట్రయిట్ గా చెప్పాడు. దీంతో ఆరోహి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దీంతో వాష్ రూమ్ లోకి వెళ్లి మరీ ఏడ్చింది. ఆ తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్నప్పుడు రేవంత్ మాములుగానే పక్కకి వచ్చి కూర్చోమని పిలిచాడు. కానీ రాలేదు. ఆ తర్వాత సూర్యని పట్టుకుని ఏడ్చింది. గేమ్ లో ఓడినందుకు కాదు ఏడ్చేది అంటూ చెప్పింది.
పక్కనే ఉన్న రేవంత్ మాట్లాడటానికి ట్రై చేస్తే, నన్ను ఇద్దరు గెలకద్దు అంటూ వెళ్లిపోయింది. ఇక్కడే రేవంత్ రెండుసార్లు వద్దు అంటూ తనే వెళ్లిందని, డెఫినెట్ గా డెఫినెట్ గా అలాగే అనుకుంటారు అనేసరికి వెనక్కి వచ్చి ఆరోహి వేలు చూపిస్తూ డిఫక్ట్ అంటే బాగోదు అంది. దీంతో వేలు కాదు ఇంకేదైనా చూపిస్తా అంటూ రెచ్చిపోయింది. డిఫెక్ట్ అని అనలేదు అన్నాడు రేవంత్. నాటకాలు చేస్తున్నారు అంటూ తిట్టుకుంటూ వెళ్లింది ఆరోహి. ఇద్దరి మద్యలో మాటల యుద్ధం జరిగింది. ఇక ఇద్దరిలో మిస్టేక్ అనేది ఉంది. ఓడిపోయినపుడు రేవంత్ ఈజీగా తీస్కుంటే సరిపోయేది.
కానీ, ఆరోహి కూడా కొద్దిగా ఎక్కువగానే మాట్లాడింది. ఇద్దరి మద్యలో ఇన్వాల్ అయినవాళ్లు కూడా రేవంత్ ని ట్రిగ్గర్ చేశారు. సలహాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వాళ్లకి కూడా లెఫ్ట్ రైట్ ఇచ్చిపారేశాడు రేవంత్. అంతేకాదు, ఆదిరెడ్డి మద్యలో ఇన్వాల్ అయితే సోషల్ మీడియా నుంచీ రాలేదు అంటూ మాట్లాడాడు. దీంతో ఆదిరెడ్డి కొద్దిగా మాటకి మాట చెప్పాడు. అందరూ హౌస్ లో ఈక్వలే అంటూ నొక్కి మరీ చెప్పాడు. ఆ విషయంలో రేవంత్ తప్పుచేశాడా అనే అనిపిస్తోంది. అనవసరంగా నోరు జారినట్లుగానే ఉన్నాడు. అంతేకాదు, మరి వీకండ్ నాగార్జున ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!