Revanth: టాస్క్ లో హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తున్న రేవంత్..! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతంత అడవిలో వేట అనే టాస్క్ జరుగుతోంది. మూడోవారం హౌస్ మేట్స్ అందరూ ముసుగులు తీసి మరీ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఏ టీమ్ లో ఉన్నా సరే ఎవరి ఇండివెడ్యువల్ గేమ్ వాళ్లు ఆడాలనే చూస్తున్నారు. ఈ టాస్క్ లో దొంగల ముఠాలో ఉన్న రేవంత్ కి అదే దొంగల ముఠా నుంచీ వ్యతిరేఖత వస్తోంది. దీనికి కారణం రేవంత్ గీతురాయల్ తో డీల్ పెట్టుకున్నాడని బలంగా నమ్మారు. దీంతో కొంతమంది దొంగలుగా మారిన హౌస్ మేట్స్ రేవంత్ కొట్టేసిన బొమ్మలని దొబ్బేశారు.

ముఖ్యంగా ఆరోహి, సుదీప, నేహా ముగ్గరూ రేవంత్ దాచుకన్న బొమ్మలని తీసేసుకున్నారు. దీంతో రేవంత్ కి తిక్కరేగింది. మన టీమ్ లోనే నాకు ఇలా చేస్తే ఎలా ఉంటూ రెచ్చిపోయాడు. నేను పోలీస్ టీమ్ ని గెలిస్తానని చెప్పాడు. దొంగలకి దొంగ గజదొంగగా మారి అన్ని బొమ్మలని పోలీసులకి ఇచ్చేస్తానని చెప్పడంతో మిగతా హౌస్ మేట్స్ ఖంగుతిన్నారు. మా బొమ్మలు దొబ్బేసినపుడు కూడా మేము నీలాగే ఫీల్ అయ్యామని, మాకో న్యాయం నీకో న్యాయమా అంటూ సుదీప రేవంత్ ని నిలదీసింది.

ఇలా చేయడం ఫెయిర్ గేమ్ కాదని, దొంగల టీమ్ మొత్తాన్ని అలా చేయకూడదని చెప్పింది. దీంతో రేవంత్ కొద్దిగా కూల్ అయ్యాడు. నిజానికి ఈగేమ్ లో హౌస్ మేట్స్ ఎలగైనా సరే కెప్టెన్సీ పోటీదారులు కావాలనే చూస్తున్నారు. అందుకే, నేహా చౌదరి రేవంత్ బొమ్మలని దొబ్బేసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నేహా కి ఇంకా రేవంత్ కి పడటం లేదు. ఇద్దరి మద్యలో పచ్చగట్టి వేస్తే భగ్గుమని మండుతోంది.

తనని కామెంట్ చేస్తున్నాడని, జోక్స్ వేస్తున్నాడని నేహా రేవంత్ తో చాలాసార్లు చెప్పింది. పుణుగులు అంటున్నావ్, నూడుల్స్ అంటున్నావ్ ఈ జోక్స్ నేను తీస్కోలేకపోతున్నానని చెప్పింది. నామినేషన్స్ తర్వాత కూడా నేహా రేవంత్ అన్న మాటలకి బాగా బాధపడింది. ఫెమినిస్ట్ అంటూనే ఇలా ఆడవాళ్లపై అరవడం కరెక్టేనా అంటూ వాపోయింది. చంటి, సుదీప, బాలాదిత్య నేహా ని ఓదార్చారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ గేమ్ లో రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు.

పోలీస్ – దొంగ టాస్క్ లో రెడ్ ట్యాగ్ బొమ్మలని దొబ్బేసిన దొంగలు వాటిని అత్యాశ వ్యాపారి అయిన గీతురాయల్ కి అమ్ముతున్నారు. గీతు పెట్టిన కండీషన్స్ కి, ధరకి లొంగిపోయి శ్రీహాన్, రేవంత్ తమ బొమ్మలని అమ్మేశారు. ఇంకా ఈ టాస్క్ ఈరోజు కూడా జరగబోతోంది కాబట్టి, ఎవరు గెలుస్తారు. ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus