Revanth,Adi Reddy: వైఫ్ – పాపతో హౌస్ లో ఆదిరెడ్డి ఫుల్ ఖుష్..! రేవంత్ ఏడుస్తోంది అందుకే..!

బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ? ఎవరు మన పక్కనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడుస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నామినేషన్స్ కూడా వేసేస్తారు. ఎప్పుడు ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఒకరంటే ఒకరికి తెలియకుండానే ప్రేమ ఉంటుంది. అందులోనూ వాళ్ల ఫ్యామిలీస్ వచ్చినపుడు మరింత ఆప్యాయంగా మారిపోతారు.

ఇందులో భాగంగానే ఆదిరెడ్డి వైఫ్ కవిత , పాప అద్విక వచ్చినపుడు ఆదిరెడ్డి ఎమోషనల్ అయిపోయాడు. ఫుల్ గా తన పాపతో ఆడుకుంటూ రెచ్చిపోయాడు. ఇది చూసిన హౌస్ మేట్స్ కూడా అమితానంద పడ్డారు. కానీ, రేవంత్ మాత్రం చూస్తూ బాధతో ఏడుస్తూ ఉండిపోయాడు. అసలు రేవంత్ ఎందుకు ఏడ్చాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ చిన్నప్పటి నుంచీ తండ్రి ఎమోషన్ ని మిస్ అయ్యాడు. అంతేకాదు, ప్రస్తుతం తను తండ్రి కాబోతున్నాడు.

ఇంకా కొన్ని రోజుల్లో ఫాదర్ అవుతాడు. అందుకే ఆ ఎమోషన్ ని ఆదిరెడ్డి పాపని చూసి బయటపెట్టేశాడు. పాపతో ఆదిరెడ్డి ఆడుకుంటుంటే తను ఎప్పుడు పాపని ఎత్తుకుంటానా అని ఆలోచనలో పడ్డాడు. అందుకే దూరంగా ఉంటూ చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. ఇదంతా ప్రోమోలో చూస్తున్న ఆడియన్స్ కూడా కంటనీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రోమోలో చూసినట్లయితే, కవిత నీ పది ఓట్లు నాకే కదా అని ఆదిరెడ్డి అడుగుతుంటే, హా వేస్తున్నా అని, నీ డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నారని చెప్పింది. నువ్వు కూడా నవ్వుతున్నావా అనేసరికి సిగ్గుపడింది. ఇక అందరూ గేమ్ పరంగా కొట్టుకోండి తిట్టుకోండి ఏదైనా చేయండి అంటూ మాట్లాడింది. నన్ను కూడా కొట్టచ్చా అంటే, నువ్వేమన్నా తోపా ఏంటి అంటూ మాట్లాడేసరికి అందరూ నవ్వేశారు. మొత్తానికి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఈవారం ఎపిసోడ్ లో హైలెట్ అనే చెప్పాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus