Revanth, Adi Reddy: ఆదిరెడ్డి వల్లే రేవంత్ హర్ట్ అయ్యాడు..! అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హౌస్ మేట్స్ హోటల్ స్టాప్ గా, గెస్ట్ లుగా మారి టాస్క్ ఆడుతున్నారు. టాస్క్ మద్యలో మేనేజర్ సుదీప వాష్ రూమ్ వాడుకోవాలంటే డబ్బులు చెల్లించాలని కండీషన్ పెట్టింది. దీనికోసం ఎవరికి వాళ్లు డీల్స్ మాట్లాడుకుని వాష్ రూమ్ వాడుకున్నారు. అయితే, ఇది గమనించిన రేవంత్ వాష్ రూమ్ ని బ్లాక్ చేశాడు. ఖచ్చితంగా మనీ ఇస్తేనే బాత్రూమ్ ఉపయోగించాలని కండీషన్ పెట్టాడు. అంతేకాదు, ఆదిరెడ్డి వచ్చి బ్రతిమిలాడినా కూడా పంపనని ముఖం మీదే చెప్పాడు.

దీంతో ఆదిరెడ్డి -రోహిత్ బిగ్ బాస్ హౌటల్ స్టాఫ్ గురించి మాట్లాడారు. ఆదిరెడ్డి రేవంత్ ని కాసేపు బ్రతిమిలాడి వెళ్లిపోయాడు. పక్కకి వెళ్లి రోహిత్ తో మాట్లాడుతూ కాసేపు నవ్వుకున్నారు. ఆ నవ్వులు మాత్రమే విన్న రేవంత్ కామెంట్స్ చేశాడు. నవ్వుకోండి బ్రదర్ బాగా నవ్వుకోండి. తెలుగు సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ అన్నప్పుడు మీకు తెలుస్తుంది. నేను మీ నవ్వులు ఏమయ్యాయో అప్పుడు చూస్తా అంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఆదిరెడ్డి కానీ, రోహిత్ కానీ వినిపించుకోలేదు. వాళ్లు పోల్ డ్యాన్స్ చూస్తూ సాంగ్ వేయడం బిగ్ బాస్ అంటూ మాట్లాడారు.

నిజానికి అంతకుముందు రేవంత్ హర్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. హౌస్ లో హోటల్ టాస్క్ లో వాష్ రూమ్ గురించి పెద్ద ఇష్యూనే జరిగింది. రేవంత్ కి ఇంకా ఆర్జే సూర్యకి కూడా గట్టిగా పడింది. ఆ తర్వాత రాజ్ శేఖర్ కి కూడా గట్టి క్లాస్ పీకాడు రేవంత్. వాష్ రూమ్ వాడాలంటే డబ్బులు కట్టాలి అని హోటల్ స్టాఫ్ చెప్పినపుడు రాజ్ మా డీలింగ్ మాకుంది అన్నాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ రాజ్ అన్నాడు. దీంతో రేవంత్ కి మండింది. ఇక్కడ ఎవరి డీల్ వాళ్లు పెట్టుకోకూడదు.

ఎవరి బిజినెస్ వాళ్లదే అని క్లియర్ గా చెప్పాడు. మా బిజినెస్ మేము చేసుకుంటాం అని క్లియర్ గా రాజ్ ని హెచ్చరిస్తూ వాష్ రూమ్ ని బ్లాక్ చేశాడు. చాలాసేపు బాత్రూమ్ దగ్గర కాపలా కాసిన రేవంత్ ఎవరినీ వాష్ రూమ్ వాడుకోకుండా చూశాడు. అంతేకాదు, బాలాదిత్యతో కూడా టాస్క్ లో పప్పుకోసం గొడవ పడ్డాడు రేవంత్. అసలు ఏదీ లేని చోట అనవసరంగా హర్ట్ అయ్యాడు. హోటల్ టాస్క్ లో గెలిచిన స్లామ్ ప్యారడైజ్ టీమ్ రేవంత్ ని టాస్క్ నుంచీ తప్పించింది. దీంతో రేవంత్ ఈవారం కూడా కెప్టెన్సీ పోటీదారుడు కాలేకపోయాడు. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus