Revanth: రేవంత్ కి క్లాస్ పీకిన హౌస్ మేట్స్..! ఏకంగా ఏడుగురు నామినేషన్..!

బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఎట్టకేలకి ముగిశాయి. ఈసారి నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. బిగ్ బాస్ ట్రాష్ టీమ్ లో వాళ్లని నేరుగా నామినేట్ చేశాడు. క్లాస్ టీమ్ వాళ్లని సేవ్ చేశాడు. మాస్ టీమ్ నుంచీ ఒక్కొక్కరు వచ్చి ఇద్దరు పార్టిసిపెంట్స్ ని నేరుగా నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ లో ఏకంగా ఏడుగురు రేవంత్ ని టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. రేవంత్ అన్నింట్లోనూ ఇన్వాల్ అవుతున్నాడని, అస్సలు ఎదుటివారికి చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదని, చెప్పేది వినిపించుకోవడం లేదని కంప్లైట్స్ అన్నీ చెప్పారు.

సుదీప, ఫైమా, వసంతీ, కీర్తిభట్, ఆరోహిరావ్, శ్రీహాన్, చంటి, ఆర్జే సూర్య ఇలా అందరూ రేవంత్ కి క్లాస్ పీకి మరీ నామినేట్ చేశారు. దీంతో ఆపరేషన్ రేవంత్ హౌస్ మేట్స్ స్టార్ట్ చేసినట్లు అయ్యింది. కొందరిని ప్రతిఘటించిన రేవంత్, ఫైనల్ గా తగ్గాడు. హౌస్ మేట్స్ ఏం చెప్తున్నారో విన్నాడు. ఖచ్చితంగా తనలోని ఈలోపాన్ని సరిచేసుకుంటానని ప్రామిస్ చేశాడు. నిజానికి మనం చూసినట్లయితే, సుదీప చెప్పిన రీజన్స్ నే తిప్పి, తిప్పి రేవంత్ కి చెప్పి అందరూ నామినేట్ చేశారు. ఆర్జే సూర్య, చంటి కూడా రేవంత్ ని వదల్లేదు.

నేరుగా నామినేషన్స్ చేసేటపుడు వేరేవాళ్ల దగ్గర ఏ రీజన్స్ లేకపోవడం వల్లే రేవంత్ ని టార్గెట్ చేసి నామినేట్ చేశారా అని అనిపించింది. అంతేకాదు, రేవంత్ బిహేవియర్ తో ఫస్ట్ నుంచీ హౌస్ మేట్స్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తను మాట్లాడే విధానం నచ్చడం లేదని రేవంత్ వెనక చర్చలు కూడా జరుపుకున్నారు. ఇప్పుడు నామినేషన్స్ లో అవకాశం దొరికింది కాబట్టి అందరూ వెపన్స్ తీసి మరీ రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఇక రేవంత్ కూడా తనలోని ఈ బిహేవియర్ ని మార్చుకుంటానని చెప్పాడు.

ఫస్ట్ రేవంత్ ఆరోహిరావ్ ని నామినేట్ చేసేటపుడు చెప్పిన రీజన్స్ ని ఆరోహి బాగా డిపెండ్ చేసుకుంది. మాటకి మాట చెప్తూ రేవంత్ తో ఆర్గ్యూ చేసింది. ఇక్కడే రేవంత్ కి సాలిడ్ పంచ్ పడింది. ఆ తర్వాత ఆరోహి తిరిగి రేవంత్ ని నామినేట్ చేస్తూ హైపర్ యాక్టివ్ అవుతున్నావ్ అని, ఇద్దరు మాట్లాడుకుంటుంటే మద్యలోకి రావడం, వేరే వాళ్లని మాట్లాడనివ్వకపోవడం చేస్తున్నావ్ అంటూ క్లియర్ గా రేవంత్ కి అర్ధమయ్యేలా చెప్పింది.

అంతేకాదు, రేవంత్ అందరితో కలవడానికే ఇలా చేస్తున్నావ్ అని నీ ఉద్దేశ్యం మాత్రం మంచిదే అంటూ రేవంత్ లోని లోపాల్ని క్లియర్ గా కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. ఫైనల్ గా ఆర్జే సూర్య కూడా రేవంత్ లోని లోపాల్ని ఎత్తిచూపాడు. దీంతో రేవంత్ సూర్యకి హగ్ ఇచ్చి మరీ హౌస్ మేట్స్ కి ప్రామిస్ చేశాడు. మరి దీనిపై వీకండ్ నాగార్జున ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus