Revanth,Shrihan: తాను శ్రీహాన్ లా కాదన్న రేవంత్.. అలా చేశానంటూ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్6 రియల్ విన్నర్ రేవంతా? లేక శ్రీహానా? అనే చర్చ జరుగుతోంది. శ్రీహాన్ 40 లక్షల రూపాయలకు ఆశ పడకుండా ఉండి ఉంటే అతనే విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొదటినుంచి రేవంత్ పేరు బిగ్ బాస్ సీజన్6 విన్నర్ గా వినిపించగా రేవంత్ కాకుండా ఓట్లు ఎక్కువగా రావడం వల్ల శ్రీహాన్ విన్నర్ గా నిలిచి ఉంటే ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతి కలిగేది.

అయితే రేవంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి, శ్రీహాన్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాకు డబ్బు కంటే బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకోవడం ముఖ్యమని రేవంత్ కామెంట్లు చేశారు. 40 లక్షల రూపాయలు అని చెప్పిన వెంటనే శ్రీహాన్ మాట మార్చేశాడని తాను మాత్రం అలా మాట మార్చలేదని రేవంత్ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాకు పేరు ముఖ్యమని పేరు సంపాదించుకుంటే డబ్బు సంపాదించుకోవడం కష్టం కాదని రేవంత్ చెప్పగా రేవంత్ చెప్పిన విషయాలు కూడా కరెక్టేనని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒకవేళ రేవంత్ కు నిజంగానే తక్కువ ఓట్లు వచ్చాయంటే మాత్రం ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని కొంతమంది చెబుతున్నారు. అయితే గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు స్టార్ మా ఛానల్ కు, బిగ్ బాస్ షో నిర్వాహకులకు మధ్య అగ్రిమెంట్ ముగిసిందని సమాచారం. అయితే రాబోయే రోజుల్లో బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లోనే ప్రసారమవుతుందా? లేక ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రసారమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్7 హోస్ట్ విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus