Revanth: టైటిల్ విన్నర్ రేవంత్..! ఇద్దరి మద్యలోనే పోటీ., రన్నరప్ ఎవరంటే.,

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అయ్యింది. ఈసారి సీజన్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. స్టార్టింగ్ వీక్స్ లోనే రేటింగ్ లేక బిగ్ బాస్ టీమ్ తలలు పట్టుకున్నారు. రివ్యూవర్స్ ని హౌస్ లోకి తీస్కోవడం, పార్టిసిపెంట్స్ సెలక్షన్ బాగోకపోవడం, ఫేమ్ ఉన్నవాళ్లు , గేమ్ సరిగ్గా ఆడేవాళ్లు లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయ్యింది. ఎట్టకేలకి ఈ సీజన్ ముగింపు దశకి చేరుకుంది.

టాప్ – 5లో ఇప్పుడు రేవంత్ టైటిల్ విన్నర్ కాబోతున్నాడు అనే వార్త చక్కర్లు కొడుతోంది. అన్ అఫీషియల్ పోలింగ్స్ ప్రకారం చూస్తే రేవంత్ విన్నర్ అవుతున్నాడనే అనిపిస్తోంది. అయితే, ఈసారి సీజన్ లో అటు బిగ్ బాస్ టీమ్ కి ఇటు ప్రేక్షకులకి కూడా అంతకంటే ఆప్షన్ లేకుండా పోయింది. రేవంత్ గేమ్ ప్రకారం చూస్తే టాస్క్ లలో తనదైన స్టైల్లో దూసుకుపోయాడు. కొన్నిసార్లు మూర్ఖంగా కూడా గేమ్ ఆడాడు. వేరేవాళ్లని మాటలు అనడం, పేర్లు పెట్టడం, కొద్దిగా చిన్నచూపు చూడటం చేశాడు.

అంతేకాదు, చాలా విషయాల్లో కిచెన్ లో తరుచుగా ఆర్గ్యూమెంట్స్ పెట్టుకుంటూ అందరి సహనాన్ని పరీక్షించాడు. దీంతో హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగింది. అయినా కూడా రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్డ్ వల్ల ఫినాలే వీక్ వరకూ వచ్చాడు. కానీ, ఫినాలే వీక్ లో ఎవ్వరూ కూడా రేవంత్ కంటే బెటర్ గా గేమ్ ఆడింది లేదు. ఏవో రీజన్స్ చెప్తూ, ఏదో కటింగ్ , బిల్డప్ ఇస్తూ టాప్ 5కి చేరినవాళ్లే.

అందుకే, ఇప్పుడు రేవంత్ కి కాంపిటీటర్ లేకుండా పోయింది. ఇక అన్ అఫీషియల్ ఓటింగ్స్ ని బట్టీ చూస్తే మాత్రం రేవంత్ ఇంకా శ్రీహాన్ ఇద్దరి మద్యలోనే పోటీ ఉండబోతోంది. వీరిద్దరినీ స్టేజ్ పైకి తీస్కుని వచ్చి నాగార్జున ట్రోఫీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ నెంబర్ వన్, శ్రీహాన్ నెంబర్ టు లో ఉండబోతున్నారు. ఇక శ్రీహాన్ తర్వాత ఆదిరెడ్డి – రోహిత్ ఇద్దరూ కూడా పోటీ పడుతున్నారు. వీళ్లలో కూడా ముూడో పొజీషన్ కి గట్టి పోటీ కనిపిస్తోంది.

అయితే, ఇక్కడే సిల్వర్ సూట్ కేస్ కానీ, లేదా గోల్డెన్ సూట్ కేస్ కానీ ఎవరైనా తీస్కుని బయటకి వస్తే లెక్కలు తారుమారు అవుతాయి. ఇక గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ కీర్తి లేదా ఆదిరెడ్డి ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ ని ఎలా ముగించబోతున్నారు అనేది ఆసక్తికరం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus