టాలీవుడ్ డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ శైలి భిన్నమనే సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ శిష్యులలో చాలామంది ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో వర్మ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ గురించి ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. వాలంటైన్ లవర్స్ ను కలపడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడని ఆర్జీవీ అన్నారు.
వాలంటైన్స్ డే రోజున హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పడం తనకు నచ్చదని లెక్కలేని బ్రేకప్ లకు వాలంటైన్ సాక్ష్యం అని ఆర్జీవీ కామెంట్లు చేశారు. ప్రేమలు , బహుమతులు అనేవి భ్రమ అని తాను ప్రేమికుల రోజుకు వ్యతిరేకం అని ఆర్జీవీ తెలిపారు. ప్రేమలో పడటం, ప్రేమించడం తప్పని ప్రేమికుల రోజుకు దూరంగా ఉండాలని ఆర్జీవీ అన్నారు. బ్రేకప్ చెప్పాలని అనుకుంటే బహుమతులు వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పాలని ఆర్జీవీ తెలిపారు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మంచిదని అయితే రెండో చూపు లేదా మూడో చూపులో ప్రేమలో పడటం మరీ మంచిదని వర్మ కామెంట్లు చేశారు. ప్రేమలో పడితే మెదడు పని చేయడం ఆగిపోయి ప్రేమికులు వెధవలుగా మారిపోయే ఛాన్స్ ఉందని వర్మ చెప్పుకొచ్చారు. ఎవరిని వాళ్లు లవ్ చేసుకోవాలని ఇతరులను లవ్ చేయడంలో అర్థమే లేదని వర్మ కామెంట్లు చేశారు. హృదయం ప్రేమను పట్టించుకోదని రక్తప్రసరణకు పని చేస్తుందని వర్మ తెలిపారు.
పెంపుడు కుక్కలు మాత్రమే నిజమైన ప్రేమను చూపిస్తాయని వర్మ అన్నారు. అబ్బాయిలు హార్ట్ ఫుల్ గా లవ్ చేస్తున్నామని చెబితే అమ్మాయిలు నమ్మవద్దని లవ్ చేస్తున్నామని చెప్పింది అతని శరీరంలోని అవయవమే తప్ప అతను కాదని గుర్తుంచుకోవాలని ఆర్జీవీ కామెంట్లు చేశారు. వెధవలు మాత్రమే ఒకసారి లవ్ లో పడతారని తెలివైన వాళ్లు నచ్చిన వాళ్లను గుర్తించి ఎక్కువసార్లు లవ్ లో పడతారని వర్మ తెలిపారు.